హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్నవరి రైతులు ఆన్‌లైన్‌ నమోదు చేసుకోవాలి: AO

BHPL: టేకుమట్లలో 2026 వానాకాలంలో సన్నరకం వరి సాగు చేసిన రైతులు ప్రభుత్వం ప్రకటించిన బోనస్‌ పొందేందుకు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని AO కళ్యాణి సూచించారు. ఏడు రకాల సన్నవరి సాగు చేసిన రైతులు విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్లను సంప్రదించి పట్టాదారు పాస్‌బుక్‌, మొబైల్‌ నంబర్‌ వివరాలు అందించాలన్నారు. SEP 10లోగా నమోదు చేసుకోవాలన్నారు.