హైదరాబాద్: 28°C
వార్తలు

200 మందితో జపాన్‌కు పీయూష్ గోయల్

వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతమే లక్ష్యంగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రేపటి నుంచి ఈనెల 27 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. 200 మంది వ్యాపార ప్రతినిధుల బృందానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. జపాన్ మంత్రులు, దిగ్గజ కంపెనీల సీఈవోలతో ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తారు. సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, ఆటోమోటివ్ తదితర రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది.