AP: వెలిగొండ ప్రాజెక్టుకు ఈనెల 31న సీఎం చంద్రబాబు నీళ్లు విడుదల చేస్తారని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం వెలిగొండకు నీళ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే ప్రారంభించారని ఆరోపించారు. నిర్వాసితులకు 3 విడతలుగా పరిహారం పంపిణీ చేశామని, ఆఖరి లబ్ధిదారుడి వరకూ పరిహారం అందిస్తామన్నారు.
వార్తలు
మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం: డీబీవీ స్వామి


