హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఇస్రో సేవలు సామాన్యుల కోసమే’

3వ జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యుల కోసం టీవీ ప్రసారాలు, విపత్తు హెచ్చరికలు, నావిగేషన్, భద్రత వంటి అనేక అప్లికేషన్లను అభివృద్ధి చేశామన్నారు. 'ఆపరేషన్ సింధూర్'లో ఇస్రో పాత్రను ఆయన కొనియాడారు. ఇస్రో విజయాల వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి, ఆవిష్కరణలు ఉన్నాయని ప్రశంసించారు.