కేరళంలోని గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో ఒకే రోజు 437 వివాహాలు జరిపించి రికార్డు సృష్టించారు. ఇవాళ మలయాళ మాసం 'చింగం' మొదటి ఆదివారం కావడంతో ఈ వివాహాలు వైభవంగా జరిగాయి. ఉ.4:10 గంటలకే వివాహ తంతు ప్రారంభంకాగా, తొలి 2 గంటల్లోనే 137 జంటలు ఒక్కటయ్యాయి. ఆలయ ప్రాంగణంలో 6 ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి, ఒక్కో వివాహానికి 24 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
వార్తలు
గురువాయూర్‌లో అరుదైన రికార్డు


