MDCL: అల్వాల్ పట్టణ పరిధిలోని ఓల్డ్ అల్వాల్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సెల్లార్‌లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
తెలంగాణ
పీఎన్‌బీ సెల్లార్‌లో అగ్ని ప్రమాదం


