హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ ఇసుక రవాణా.. కేసు నమోదు

KNR: గన్నేరువరం మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. చొక్కారావుపల్లి బిక్కవాగు నుంచి అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుక తరలిస్తుండగా ఎల్లమ్మగుడి సమీపంలో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి యజమానిపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.