హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతో జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.