బాలీవుడ్ నటుడు ముకేశ్ ఖన్నా జాతీయ గీతంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జనగణమన గీతాన్ని బ్రిటిష్ కాలంలో రాశారు. అందులో 'అధినాయక' అంటే అప్పటి పాలకులే. ఆ గీతం ఎవరిని ఉద్దేశించి పాడతామో అర్థం చేసుకోవాలి. మాతృభూమిపై భక్తిని చాటే 'వందేమాతరం'కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి' అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం వచ్చినా ఇంకా ఆంగ్ల విద్యా విధానానికే మనం ఎక్కువ విలువ ఇస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
వార్తలు
జనగణమనపై ముకేశ్ ఖన్నా వ్యాఖ్యలు


