హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఢిల్లీలో 25వ లైబ్రరీని ఓపెన్ చేసిన HYD అమ్మాయి

HYDకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీష్ న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో 25వ ఓపెన్ లైబ్రరీని ప్రారంభించింది. 13 ప్రాంతీయ భాషల్లో 2,136పుస్తకాలను అందుబాటులో ఉంచింది. రోటరీ యంగ్ అచీవర్ అవార్డు ప్రైజ్‌మనీ రూ.లక్షను మౌలిక వసతులకు వినియోగించింది. భవిష్యత్‌లో మరో 75 లైబ్రరీలు ఏర్పాటు చేసి మొత్తం 100 గ్రంథాలయాల లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయమని తెలిపింది.