హైదరాబాద్: 28°C
వార్తలు

అల్పపీడనం.. అప్రమత్తంగా ఉండాలి: అనిత

AP: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు మరింత అలర్ట్‌గా ఉండాలని పేర్కొన్నారు. సముద్రంలో అలజడి దృష్ణ్యా జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ సమన్వయంతో పనిచేయాలన్నారు.