హైదరాబాద్: 28°C
వార్తలు

అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

అమెరికాలో భారత సంతతికి చెందిన సురేష్ పటేల్(62) అనే వ్యాపారి హత్యకు గురయ్యారు. గుజరాత్ మెహసానా జిల్లాకు చెందిన సురేష్, కుమార్తెతో కలిసి షాప్‌లో ఉండగా.. డబ్బు కోసం వచ్చిన ఆగంతకుడు గన్‌తో బెదిరించి నగదు తీసుకెళ్లాడు. ఆపై ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ ఘటనలో సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.