హనుమకొండ కేయూ పోలీస్‌స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ అధికారులు భారీగా అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మధుతండా శివారులోని ఓ మూసివేసిన షట్టర్ గదిలో 152 బస్తాల్లో ఉన్న 77.70 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించారు. దీని విలువ రూ.2.71 లక్షలు ఉంటుందని తెలిపారు. బియ్యాన్ని పోలీసులకు అప్పగించగా, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ
టాస్క్‌ఫోర్స్ దాడి.. 152 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం


