హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాంబు దాడిలో గాయపడిన మహిళను పరామర్శించిన.. మాజీ MLA

BHPL: రేగొండ (M) గూడేపల్లిలో వ్యవసాయ పనులు చేస్తుండగా బాంబు పేలడంతో గాయపడిన కూలీ గుండె స్వర్ణలతను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదివారం పరామర్శించారు. పరకాలలోని వినూత్న ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.