హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

KNR: మానకొండూరు ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో కుట్టు శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంగణ మేనేజర్ సుధాకర్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలు, పేదలు, వితంతువులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ శిక్షణ ఎంతో సహాయపడుతుందున్నారు. ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 7660022511లో సంప్రదించాలని పేర్కొన్నారు.