హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిలపై BJP పోరుబాట..!!

HYD: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈనెల 24, 25 తేదీల్లో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. రూ.15 వేల కోట్ల బకాయిలతో 40 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు దీక్షకు మద్దతు ఇవ్వాలని కోరారు.