GDWL: గద్వాల మండలం పూడూరు గ్రామంలో లబ్ధిదారు సుక్యమ్మ నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని, నియోజకవర్గంలో మొదటి విడత కింద మంజూరైన 3,500 ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పూడూరులో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే


