HYD: బన్సీలాల్‌పేట చాచా నెహ్రూ నగర్‌లోని నల్ల పోచమ్మ ఆలయంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
తెలంగాణ
నల్ల పోచమ్మ ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు


