NZB: ఇందల్వాయి మండలం చంద్రంపల్లి శివారులో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం నారింజ పండ్ల లారీ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. టోల్ ప్లాజా సిబ్బంది ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు వేగవంతం చేశారు.
తెలంగాణ
జాతీయ రహదారిపై నారింజ పండ్ల లారీ బోల్తా.!


