హైదరాబాద్: 28°C
తెలంగాణ

గొల్లగూడ గ్రామంలో నూతన షెడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

ASF: రెబ్బెన మండలం కైరిగూడ పరిధిలోని గొల్లగూడ గ్రామంలో DMFT నిధులు రూ.3 లక్షలతో శ్రీ సేవాలాల్ జగదాంబ మాత మందిరం వద్ద నూతన షెడ్డు నిర్మాణానికి ఆదివారం సర్పంచ్ సంధ్యారాణి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. గ్రామ ప్రజల అవసరాలను తీర్చేందుకు ఈ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. త్వరితగతిన షెడ్ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.