హైదరాబాద్: 28°C
తెలంగాణ

జన్నారం ఫారెస్ట్ సెక్షన్ ఇన్ఛార్జ్‌గా మమత నియామకం

మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ ఫారెస్ట్ సెక్షన్ ఇన్చార్జ్‌గా పూదారి మమతను నియమిస్తూ ఎఫ్‌డీఓ రామ్మోహన్ ఆదివారం ఉత్తర్వులను జారీ చేశారు. కాగా గతంలో ఆమె తాళ్ళపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌గా విధులను నిర్వహించి ఇప్పుడు బదిలీపై జన్నారంకు రానున్నారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. అటవీ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం పంచుకోవాలని కోరారు.