హైదరాబాద్: 28°C
వార్తలు

మునిగిన పడవ.. మత్స్యకారులు సురక్షితం

AP: విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు బయలుదేరిన పడవ మునిగింది. ఫిషింగ్ హార్బర్‌కు 2.8 నాటికల్ మైళ్ల దూరంలో రాయిని ఢీకొట్టడంతో మెకనైజ్డ్ బోటు నీటిలో మునిగింది. పడవలో ఉన్న ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. మరో పడవ సహాయంతో ఫిషింగ్ హార్బర్‌కు జాలర్లు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.