హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు పోలింగ్

SRCL: సిరిసిల్ల పద్మశాలి పట్టణ యువజన సంఘం ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది.