KMR: బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై అనిల్ ఆదివారం తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. వారి వద్ద నుంచి రూ. 2360 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
తెలంగాణ
ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్


