నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం సగటున 4.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిర్మల్ (అర్బన్)లో 10.6 మి.మీ, పెంబిలో 8.7 మి.మీ, కద్దంపెద్దూరులో 7.4 మి.మీ వర్షం కురవగా, కుంటాలలో వర్షం నమోదు కాలేదు. జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 667.6 మి.మీ కాగా, వాస్తవంగా 610.1 మి.మీ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
నిర్మల్ జిల్లాలో 4.3 మి.మీ సగటు వర్షపాతం నమోదు


