హైదరాబాద్: 28°C
వార్తలు

‘దేశంలో 8.7 కోట్ల మందికి పనిలేదు’

దేశంలో 15-29 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం, కనీస శిక్షణ లేకుండా ఖాళీగా ఉన్నారని నీతి ఆయోగ్‌ తాజా నివేదిక వెల్లడించింది. ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరు నైపుణ్యాలు పెంచుకోలేకపోతున్నారని తెలిపింది. 'వికసిత్‌ భారత్‌ కోసం నైపుణ్యాభివృద్ధి పునఃకల్పన-2047' పేరుతో 78వ జాతీయ శాంపిల్‌ సర్వే ఆధారంగా ఈ రిపోర్ట్ రూపొందించారు.