సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'జడ్జీలు దేవుళ్లు కారు. మా ప్రతి తీర్పూ నూటికి నూరు శాతం సరైనదే అని అనుకోలేం. తీర్పులు చెప్పేటప్పుడు న్యాయమూర్తులకు వినమ్రత అవసరం. కేవలం చట్టం, కేసులోని వాస్తవాలే కాకుండా ఆ పిటిషన్ వెనుక ఉన్న వ్యక్తి బాధను చూడాలి' అని ఆయన సూచించారు.
వార్తలు
జడ్జీలేం దేవుళ్లు కారు: జస్టిస్ కరోల్


