హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిట్టుబాటు ధర కోసం రైతుల ధర్నా

సత్యసాయి: టమాటాకు గిట్టుబాటు ధర కల్పించి, ఆదుకోవాలని జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహదేవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనగానపల్లె 4 రోడ్ల సర్కిల్లో శనివారం ధర్నా నిర్వహించారు. మార్కెట్లో బాక్సు టమాటా రూ.70 మాత్రమే పలుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల స్థిరీకరణ చర్యలు చేపట్టాలని కోరారు.