NTR: మెగా డీఎస్సీ నియామకాలపై అనుమానాలుంటే ఆధారాలతో అధికారులను సంప్రదించాలని ఎమ్మెల్సీ వర్ల రామయ్య సూచించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, ప్రతిరోజూ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటామని ప్రకటించారని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం వల్ల అభ్యర్థుల్లో అనవసర అపోహలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మెగా డీఎస్సీపై అనుమానాలుంటే ఆధారాలివ్వండి'


