హైదరాబాద్: 28°C
వార్తలు

గణేశుడి విగ్రహం కూలి ఇద్దరు మృతి

ముంబైలోని భూలేశ్వర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 'భూలేశ్వర్చా రాజా' గణేశుడి భారీ విగ్రహాన్ని ఊరేగింపుగా తరలిస్తుండగా ఒక్కసారిగా భక్తులపైకి కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిలో ఇద్దరు చిన్నారి బాలికలు ఉన్నారు. వెంటనే పోలీసులు, బీఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.