హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దోపిడీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్!

GNTR: గాజు సీసాతో బెదిరించి రూ.4,500 నగదు దోచుకెళ్లిన కేసులో శశివర్ధన్‌(24) అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు మంగళగిరి సీఐ వెంకట్‌ తెలిపారు. నిందితుడి నుంచి దోపిడీ చేసిన సొమ్ముతో పాటు ఒక యాక్టివా స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శశివర్ధన్‌పై గతంలోనూ దొంగతనాలు, గంజాయి విక్రయాలు, దోపిడీలు, భౌతిక దాడులకు సంబంధించి పలు కేసులు నమోదై ఉన్నాయని వెల్లడించారు.