హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆయిల్ ఫామ్ రైతులను కాపాడాలి: రైతు సంఘం

ELR: ఆయిల్ ఫామ్ రైతులను కంపెనీలు, దళారుల మోసాల నుంచి కాపాడాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది. శనివారం ఏలూరు అన్నే భవనంలో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడారు. వే-బ్రిడ్జ్ కాటాల వద్ద గెలలపై నీళ్లు కొట్టి బరువు పెంచుతున్నారని, దీనివల్ల ఫ్యాక్టరీల్లో ధర తగ్గి రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. అక్రమ వాటరింగ్ అరికట్టి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు.