హైదరాబాద్: 28°C
వార్తలు

స్వైన్‌ఫ్లూ టెర్రర్.. జనం బెంబేలు

ఢిల్లీని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. దేశ రాజధానిలో కేసులు భారీగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 114 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన మొత్తం స్వైన్‌ఫ్లూ కేసుల సంఖ్య 1,777కు చేరింది. కేవలం గత రెండు వారాల్లోనే 433 కొత్త కేసులు నమోదు కావడంతో.. వేగంగా ప్రబలుతున్న ఈ వ్యాధితో అధికారులు అప్రమత్తమయ్యారు.