హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కులం పేరుతో దూషణ ఘటనపై వివాదం

అన్నమయ్య: రామాపురం మండలం చిట్లూరు హరిజనవాడ ఆంజనేయస్వామి ఆలయ లెక్కల నిర్వహణపై వివాదం నెలకొంది. దీనిపై ప్రశ్నించిన నరసింహులును కులం పేరుతో దూషించి చెప్పులతో కొట్టి, అక్రమ కేసులు పెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. తహసీల్దార్ ఎదుట గురువారం బైండోవర్ చేసినప్పటికీ, శుక్రవారం పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుని కొట్టారని వారు వాపోయారు.