హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడే పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా

అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఆదివారం విడుదల చేయనున్నారు. ఈ నెల 26 వరకు ఎంపీడీవో కార్యాలయాల్లో అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తారు. తుది జాబితాను 30న ప్రకటిస్తారు. జిల్లాలో 577 గ్రామ పంచాయతీలు, 5,840 వార్డులు, 6,054 పోలింగ్ కేంద్రాలు, 13,65,922 మంది ఓటర్లు ఉన్నారు.