హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆస్పరిలో జింకను చంపిన చిరుత.!

KRNL: ఆస్పరి మండలం హాలిగెర గ్రామ అడవుల్లో చిరుత సంచరిస్తున్నట్లు శనివారం గ్రామస్థులు తెలిపారు. జింకను వేటాడే క్రమంలో పంట పొలాలను పాడు చేసి రైతులకు నష్టం కలిగించిందన్నారు. ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉందని, కొండల వైపు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.