హైదరాబాద్: 28°C
వార్తలు

'కాళేశ్వరంపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనం అవసరం'

TG: కాళేశ్వరం ప్రాజెక్టు భద్రతపై సాంకేతిక అధ్యయనం జరగాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. మేడిగడ్డ బ్యారేజీ సమస్యను దీర్ఘకాలిక భద్రత కోణంలో పరిశీలించాలన్నారు. అలాగే, సీఎం రేవంత్ మెరికా పర్యటనను రాజకీయాల కోసం కాకుండా, రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకురావడానికే చేపట్టారని స్పష్టం చేశారు. ఈ పర్యటనకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.