హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SRBCకి వెంటనే నీరు విడుదల చేయాలి: కాటసాని

KNL: కర్నూలు జిల్లా ప్రజల నీటి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని శనివారం వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి SRBCకి నీరు విడుదల చేస్తే పాణ్యం, బనగానపల్లె ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీరుతుందన్నారు. శ్రీశైలం నీటి విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.