హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు పదార్థాలపై పోలీసుల విస్తృత తనిఖీలు

KRNL: నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. టూ టౌన్ సీఐ శ్రీధర్, ఫోర్త్ టౌన్ సీఐ విక్రమసింహ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, సంకల్‌బాగ్, బస్టాండ్, ఎల్కూర్ బంగ్లా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు చేశారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.