హైదరాబాద్: 28°C
వార్తలు

ఎండోస్కోపిక్‌ కెమెరాతో ప్రశ్నపత్రం లీక్‌

ఛత్తీస్‌గఢ్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పేపర్ లీక్ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రైవేటు కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్‌తోపాటు ఐదుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్.. ప్రశ్నపత్రం ఉన్న సీల్డ్ కవర్‌లోకి ఎండోస్కోపిక్‌ కెమెరాను పంపించి ఫొటోలు, వీడియోలు తీసినట్లు విచారణలో తేలింది.