హైదరాబాద్: 28°C
వార్తలు

రైతుల రుణాల వసూళ్లు ఆపాలి

KRNL : కరువు పరిస్థితుల్లో పంటలు దెబ్బతిని తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతుల నుంచి బ్యాంకు రుణాల వసూళ్లకు తొందరపడవద్దని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. జగన్నాథం, సీపీఐ నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి కోరారు. రైతులకు రుణాలు చెల్లించేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరుతూ కేడీసీసీ బ్యాంకు సీఈఓ బాలాజీకి వినతిపత్రం సమర్పించారు.