హైదరాబాద్: 28°C
వార్తలు

రేవంత్ పర్యటన నిరాకరణపై ఖర్గే మండిపాటు

తెలంగాణ సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కారణాలతోనే రేవంత్ పర్యటనకు అనుమతిని రద్దు చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణాను ప్రగతి పథంలోకి తీసుకురావడం కోసం పెట్టుబడులు ఆహ్వానించడానికి సీఎం చేస్తున్న పర్యటనలను అడ్డుకోవడం తగదన్నారు. కావాలనే పర్యటనకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు.