హైదరాబాద్: 28°C
వార్తలు

రాహుల్ పర్యటనకు ముందు ఉద్రిక్తతలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పూణె పర్యటనకు ముందు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రాహుల్ పర్యటన సందర్భంగా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, పూణె హాస్టల్ క్యాంపస్‌లో ఏబీవీపీ, NSUI సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 50 మందికి పైగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోసారి ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు.