ఢిల్లీలోని నిహాల్ విహార్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య కుటుంబ సభ్యుల దాడిలో 31 ఏళ్ల టెకీ వినయ్ గుప్తా మృతి చెందాడు. బిడ్డ మందుల విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ విషయంలో భార్య కుటుంబ సభ్యులు భర్త గొంతు నులిమి, ఛాతిపై దాడికి చేశారు. దీంతో తీవ్ర గాయాలతో టెకీ వినయ్ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
దారుణం.. భార్య బంధువుల దాడిలో భర్త మృతి


