హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాలపాటిదీన్నేలో ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ సత్యసాయి జిల్లా పాలపాటిదీన్నేలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కాణిపాకం తరహాలోనే ఇక్కడ ప్రమాణాలు చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. శ్రావణ మాస విశేష పూజలు నిర్వహించడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు.