కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇవాళ అధికారులతో కలిసి పర్యటించారు. 5, 7వ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీటి పైపుల లీకేజీలను వెంటనే సరిచేయాలని, బ్లీచింగ్ చల్లుతూ పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. అనారోగ్యంతో ఉన్న కుక్కలను పట్టుకునేందుకు డాగ్ క్యాచర్లను రప్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
డయేరియా కేసులపై ఎమ్మెల్యే ఆదేశాలు


