హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులు

W.G: మార్టేరు వ్యవసాయ పరిశోధనా సంస్థకు చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థినులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్టు వైస్.ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తెలిపారు. కళాశాలకు చెందిన అక్షిత, మృదులత జిల్లా స్థాయిలో కోకో, లాంగ్ జంప్,100 మీటర్ల పరుగులో ప్రతిభ కనబరిచారన్నారు. కాగా ఈనెల 27న తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థినులు పాల్గొంటారు.