ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ దేవత కోట్లమ్మ అమ్మవారి శ్రావణమాసం సంబర మహోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు 108 బిందెలతో జలాలను తీసుకొచ్చి కోట్లమ్మ అమ్మవారికి జలాభిషేకం భక్తిశ్రద్ధలతో చేశారు. ఆదివారం అమ్మవారి సంబర మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అవతారం, గోలి గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోట్లమ్మ అమ్మవారికి జలాభిషేకం


