హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మౌలిక వసతులు కల్పించాలి'

SKLM: సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఎం నాయుక్, ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్‌ని ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమంపై చర్చించారు. అలాగే, గిరిజన గ్రామాలకు రహదారులు, రవాణా, మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు.