హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతి గృహాలను సందర్శించిన న్యాయమూర్తి

VZM: విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో గల బిసి, ఎస్సి సంక్షేమ వసతి గృహాలతో పాటు కేజీబీవీని గజపతినగరం కోర్టు న్యాయమూర్తి ఏ. విజయ్ రాజ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయో ఆరా తీశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాలు పెట్టాలని సూచించారు. వార్డెన్‌లు పాల్గొన్నారు.